Job Notification: మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులు

మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపుతోంది. ఇప్పటికే గ్రూప్స్, మెడికల్, వైద్యశాఖతో పాటు ఇతర డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈసారి మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న 9 మెడికల్ కాలేజీల్లో మరో 313 పోస్టులు మంజూరు చేయనుంది. దీంతో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.

  Last Updated: 04 Feb 2023, 12:56 PM IST