Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో హోంగార్డు కిడ్నాప్ . దాడితో మృతి

Hyderabad

Hyderabad

Hyderabad: ఆర్థిక వివాదాల కారణంగా సెప్టెంబర్ 11న సంతోష్‌నగర్‌లో 31 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేశారు. యాఖుత్‌పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి గతంలో హోంగార్డుగా పనిచేశాడు. సెప్టెంబర్ 11న రిజ్వాన్ ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రిజ్వాన్ తండ్రికి కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చింది. తన కుమారుడిని సురక్షితంగా విడుదల చేసేందుకు రూ.10 లక్షలతో బజార్‌ఘాట్‌కు రావాలని చెప్పారు. దాంతో ఆ తండ్రి ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కిడ్నాపర్లకు రూ.2 లక్షలు చెల్లించి తన కొడుకును సెప్టెంబర్ 13న విడుదల చేశాడు.అయితే, విడుదలైన తర్వాత రిజ్వాన్ అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజుల పాటు కిడ్నపర్లు అతడిని హింసించారు. కిడ్నాపర్లు చేసిన దాడికి రిజ్వాన్ రక్తపు వాంతులు చేసుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఒవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటూ సెప్టెంబర్ 18 న మరణించాడు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Jagan Cabinet Inside : మంత్రివ‌ర్గంలో `ముంద‌స్తు`టాక్స్