Asifabad: గేదెను కరిచిన కుక్క.. 300 మంది ఆసుపత్రి పాలు?

సాధారణంగా కుక్క కరిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. లేదంటే ఇన్ఫెక

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 06:45 PM IST

సాధారణంగా కుక్క కరిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. లేదంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదం ఉంది అని చెబుతూ ఉంటారు. అందుకే కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ చేయించుకోవాలి అని అంటూ ఉంటారు. ఒకవేళ అదే కుక్క జంతువులను కరిస్తే ఏమవుతుంది. తాజాగా అలా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక కుక్క కలిసిన గేదె పాలు తాగిన గ్రామస్తులందరూ భయంతో ఆసుపత్రికి పరుగులు తీశారు. అసలేం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక పాడి రైతు అయినా నాన్నయ్యకు 16 గేదెలు ఉన్నాయి. అతను పాడి గేదెల పాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కాగా ఈ రెండు నెలల క్రితం ఒక గేదెను ఒక పిచ్చి కుక్క కరిచింది. కానీ ఆ విషయాన్ని అతను బయట ఎవరికి చెప్పకుండా గ్రామంలో వందలాది మందికి గేదె పాలు పెరుగు విక్రయించాడు. అయితే రెండు రోజుల క్రితం కుక్క కరిచిన ఆ గేదె దూడ చనిపోయింది.

ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి గ్రామంలో మొత్తం అందరికి తెలిసిపోయింది. ఒక విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పంచాయతీ సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నాన్నయ్య నుంచి పాలు పెరుగు కొనుగోలు చేసి విక్రయించిన దాదాపు 302 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను వేశారు. కాగా ఆ బాధితులలో మండల అధికారులు కూడా ఉన్నారు. అయితే ఆ పాలను వేడి చేసి తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు అని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఆ గేదె యొక్క దూడ పొదుగు వద్ద కొరికితే పాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉంది అని వారు తెలిపారు. కాబట్టి ముందస్తుగా యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవడం మంచిదని తెలిపారు. అయితే గేదె పాలు తాగిన దూడ చనిపోగా కుక్క కరిచిన గేదెకు మాత్రమే ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఆ దూడ ఏదైనా అనారోగ్యం కారణంగానే చనిపోయి ఉంటుందని ఇందులో భయపడాల్సిన పనిలేదు అని చెప్పడంతో గ్రామస్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..