3000 Year Old Sword : సమాధిలో 3వేల ఏళ్ళ కిందటి ఖడ్గం

3000 Year Old Sword : అది అలాంటి ఇలాంటి ఖడ్గం కాదు.. 3000 ఏళ్ళ కిందటి ఖడ్గం..

  • Written By:
  • Updated On - June 17, 2023 / 09:19 AM IST

3000 Year Old Sword : అది అలాంటి ఇలాంటి ఖడ్గం కాదు.. 

3000 ఏళ్ళ కిందటి ఖడ్గం..

జర్మనీలోని బవేరియా రాష్ట్రం  నోర్డ్లింగెన్‌ పట్టణంలో కాంస్య యుగం (Bronze Age)  నాటి ఒక ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడున్న ఒక సమాధిని తవ్వగా తొలుత ముగ్గురి మృతదేహాల అవశేషాలు లభించాయి. వాటిని శాస్త్రవేత్తలు పరిశీలించగా.. అవి పురుషుడు, స్త్రీ,  బాలుడి మృతదేహాలని తేలింది. ఆ ముగ్గురిని ఖడ్గంతో పాటు సమాధిలో ఖననం చేశారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Also read : Tipu Sultan: వామ్మో.. టిప్పు సుల్తాన్ ఖడ్గం అన్నీ రూ. కోట్లా?

దీనిపై బవేరియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ జూన్ 14న ఒక ప్రకటన విడుదల చేసింది. కాంస్య యుగంలో ఆది మానవులు ఇలాంటి ఫుల్-హిల్ట్ ఖడ్గాల (అష్టభుజి ఖడ్గం)ను వినియోగించేవారని తెలిపింది. ఈ ఖడ్గం పూర్తిగా కాంస్యంతో తయారైందని పేర్కొంది. భూమిలో పాతిపెట్టి వేల సంవత్సరాలు గడిచినా ఈ కత్తి కొత్తదానిలా ఇంకా మెరుస్తుండటం విశేషం. ఈ ఖడ్గం క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నాటిదని(3000 Year Old Sword) పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు. నైపుణ్యం కలిగిన లోహపు పనివాళ్ళు మాత్రమే అష్టభుజి కత్తులను తయారు చేయగలరని తెలిపారు. రెండు రివెట్‌లను కలిగి ఉన్నఖడ్గం హ్యాండిల్ బ్లేడ్‌పై ఓవర్‌లే కాస్టింగ్ వేశారంటే ఆనాడు ఖడ్గాల తయారీ ఎంత అడ్వాన్స్ స్థాయిలో ఉండేదో అర్ధం చేసుకోవచ్చన్నారు.