Site icon HashtagU Telugu

Yadadri: యాదాద్రికి కట్టుదిట్టమైన భద్రత!

Yadadri

Yadadri

పునరుద్ధరణ అనంతరం సోమవారం ప్రారంభమైన యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొనేందుకు ఆలయానికి వీఐపీల సందర్శన దృష్ట్యా యాదాద్రిలో OCTPUS, గ్రేహౌండ్స్ కమాండోలతో సహా మొత్తం 3,000 మంది పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు వెళ్లే వాహనాలు మినహా వ్యక్తిగత వాహనాలను కొండపైకి పోలీసులు అనుమతించలేదు. యాదాద్రి కొండపైకి మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ యాదాద్రిలో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.