Site icon HashtagU Telugu

Finance Minister: 300 యూనిట్ల విద్యుత్ ఉచితం.. కేంద్ర ఆర్థిక మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

Finance Minister

Safeimagekit Resized Img (4) 11zon

Finance Minister: ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతిని అడ్డుకోగలిగిందని ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందించామని అన్నారు. పదేళ్లు పారదర్శక పాలన అందించామని చెప్పారు. అందుకే మరోసారి ప్రజలు తమ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారనే నమ్మకం ఉందని వెల్లడించారు.

అంతేకాకుండా.. జిడిపి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నదని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా సవాళ్లు పెరుగుతున్నాయి కానీ ఈ సంక్షోభంలో కూడా భారతదేశం మంచి GDP వృద్ధిని సాధించిందన్నారు. GST కింద వన్ నేషన్ వన్ మార్కెట్ సాధించబడిందన్నారు. భారతదేశం, మధ్యప్రాచ్య ఐరోపా మధ్య కారిడార్ నిర్మాణ ప్రకటన గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడుతుందన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే, సమ్మిళిత వృద్ధికి దారితీసే ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. ఆర్థిక విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పని చేస్తామన్నారు. 3 కోట్ల ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని, వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కింద ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.

Also Read: FM Nirmala Sitharaman Budget Saree : బడ్జెట్ రోజున ప్రత్యేకమైన చీర తో నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. జన్‌ధన్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా రూ.2.7 లక్షల కోట్లు ఆదా అయ్యాయని, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఉన్నత స్థాయిలో ఉందని, దేశానికి కొత్త దిశానిర్దేశం, కొత్త ఆశలు కల్పించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, వర్గాలు దేశ ఆర్థిక ప్రగతిలో సమిష్టిగా లబ్ధి పొందేలా మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్థిక రంగం మరింత పటిష్టంగా, మరింత సులభంగా నిర్వహించగలిగేలా తయారు చేయబడుతోంది. దేశంలో ద్రవ్యోల్బణానికి సంబంధించి క్లిష్ట సవాళ్లను అధిగమించడంతోపాటు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

దేశంలో కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదిందని నిర్మలా సీతారామన్ అన్నారు. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించామని చెప్పారు. కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని వెల్లడించారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాలను శక్తివంతం చేశామని వ్యాఖ్యానించారు.

జీడీపీకి కొత్త అర్థం చెప్పిన ఆర్థిక మంత్రి

జీడీపీకి తమ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘‘స్టార్టప్‌ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చాం. GDP అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పెర్ఫార్మెన్స్‌ అని కొత్త అర్థం ఇచ్చాం. ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం’’ అని తెలిపారు.