300 Mobiles Stolen: ‘గాడ్ ఫాదర్ ప్రిరిలీజ్’లో రెచ్చిపోయిన దొంగలు.. 300 మొబైళ్లు మాయం!

బుధవారం ఇక్కడి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దొంగలు

Published By: HashtagU Telugu Desk
God Fahter

God Fahter

బుధవారం ఇక్కడి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దొంగలు కేవలం గంట వ్యవధిలో 300 మొబైల్స్ దొంగిలించారు. గత 24 గంటల్లో 270 ఫిర్యాదులు అందాయి. మొబైల్ దొంగతనాలపై ఫిర్యాదులను స్వీకరించడానికి అనంతపురం పోలీసులు ప్రారంభించిన వాట్సాప్ సర్వీస్ ద్వారా  III టౌన్ పోలీసులకు మరో 20, II టౌన్ పోలీసులకు మరో 10 ఫిర్యాదులు అందాయి. ప్రిరిలీజ్ ఈవెంట్ ఒకేసారి 300 మొబైల్స్ చోరీకి గురికావడంతో మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేలాది మంది మెగాస్టార్ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అద్భుతంగా నటించారని కొనియాడారు. నయనతార, పూరీ జగన్నాధ్, సత్యదేవ్ కంచరణ, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని కీలక పాత్రల్లో మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ బ్యానర్‌లపై రామ్ చరణ్, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు.

  Last Updated: 30 Sep 2022, 02:52 PM IST