Site icon HashtagU Telugu

Hyderabad: సిటీ శివారులో రెచ్చిపోతున్న దొంగలు.. 30 తులాల బంగారం చోరీ

Thief Escaping

Thief Escaping

Hyderabad: హైదరాబాద్ సిటీ శివారులో మళ్లీ  చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఒక ఇంట్లో 30 తులాలు బంగారం దోచుకుంది. ఆరుగురు ముఠా సభ్యులు ఉన్న ఈ చెడ్డీ గ్యాంగ్ మియాపూర్ సమీపంలోని ఓ విల్లా కమ్యూనిటీలో గోడలు దూకడం, ఇళ్లల్లో చొరబడటం.. అన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.  ఇది నిజమేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫామ్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ చెడ్డీ గ్యాంగ్‌కి క్రిమినల్ రికార్డ్స్‌లో 60 నుంచి 70 ఏళ్లకు పైగానే నేర చరిత్ర ఉంది. వీళ్లు ఎక్కువగా తాళాలేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు.

మధ్యప్రదేశ్ నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు వస్తారు. దొంగతనం చేసే ముందు షర్టు ప్యాంటు తీసేసి జస్ట్ ఒక చెడ్డీతో రంగంలోకి దిగుతారు. 7-8 అడుగుల గోడ కూడా అవలీలగా ఎక్కి దూకగలుగుతారు. సీసీ కెమెరాలకు దొరక్కుండా ముఖాలకు మాస్కులు వేసుకుంటారు. తాళాలు పగలగొట్టడంలో వీళ్లు సిద్ధహస్తులు. ఇంట్లో చొరబడి తాపీగా దొంగతనం చేస్తారు.