Site icon HashtagU Telugu

Wedding Season : రేపటి నుంచే పెళ్లిళ్ల సీజన్.. 3 నెలల్లో 30 శుభ ముహూర్తాలు

Wedding Season

Wedding Season

Wedding Season : శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం శనివారం మొదలవుతోంది.  ఈ నెల 11 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతోంది. 11వ తేదీ నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు దాదాపు 3 నెలల పాటు శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 26వ తేదీ వరకు మాఘం, ఫాల్గుణం, చైత్ర మాసాల్లో పెళ్లిళ్లకు దాదాపు 30 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ వ్యవధిలో నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, నూతన గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు కూడా చేయొచ్చు. ఈ నెల 14న వసంత పంచమి రోజున తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. చాలా కల్యాణ మండపాలు ముందే బుకింగ్‌ అయ్యాయి. బ్యాండ్‌ మేళాలు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, పూజారులు, క్యాటరింగ్‌, డెకరేటర్లు, ఈవెంట్‌ మేనేజర్లు బిజీగా మారారు. బంగారు, వస్త్ర, పూల దుకాణాలు సందడిగా మారాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతోనే వివాహ ముహూర్తాలన్నీ(Wedding Season) అయిపోతాయి. మూఢం, శూన్య మాసం వస్తుండడంతో మళ్లీ శ్రావణ మాసం (ఆగస్టు) వరకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసం వచ్చేసరికి వానాకాలం మొదలవుతుందని పండితులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మొత్తం మీద పెళ్లిళ్ల సీజన్ వల్ల లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్‌ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది.కేవలం ఫంక్షన్ హాల్స్ మాత్రమే కాదు.. పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్‌ చేసుకుంటారు. అన్నవరం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. మొత్తం మీద ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మంగళవాయిద్యాలు మోగనున్నాయి.

ఫిబ్రవరి నెల మూహూర్తాలు : 11, 13, 14, 15, 18, 19, 21, 22, 24

మార్చి నెల మూహూర్తాలు : 1, 3, 7, 11, 13, 16, 17, 19, 20, 24, 25, 27, 28, 30

ఏప్రిల్‌ నెల మూహూర్తాలు : 1, 3, 4, 5, 6, 9, 18, 19, 20, 21, 22, 24, 26

Also Read : Imran Vs Nawaz : ఇమ్రాన్ వర్సెస్ నవాజ్.. పోటాపోటీగా గెలుపు ప్రసంగాలు.. చేయి కలిపిన నవాజ్, భుట్టో

వరుస ముహూర్తాలు ఉండటంతో అన్నింటికీ డిమాండ్ పెరిగింది. ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ఫంక్షన్ హాలు స్థాయిని బట్టి లక్షల్లో పలుకుతుంది. క్యాటరింగ్ కూడా శాఖాహార భోజనం ప్లేట్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మంగళవాయిద్యాలు, పూలు, డెకరేషన్ ఇలా అన్ని రేట్లు విపరీతంగా పెరిగాాయి. అయినా పెళ్లి కావడంతో అప్పులు చేసి మరీ పెళ్లికి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మూడు నెలల కాలంలో వేలాది జంటలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కానున్నాయి.

Exit mobile version