Site icon HashtagU Telugu

30 Sheeps Killed: పిడుగుపడి గొర్రెల కాపరి, 30 గొర్రెలు మృతి

Heavy Rains In Upcoming 48 Hours

Heavy Rains In Upcoming 48 Hours

తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చోట్లా వడగండ్ల వర్షం పడుతోంది. పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ విజయపూరి సౌత్ చింతలతండ కు చెందిన గొర్రెల కాపరి గొర్రెలను మేపుతుండగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో ఉరుములతో కూడిన అకాల వర్షం కురవడంతో పిడుగుపడి గొర్రెలు కాపరి రామవత్ సైదా,30 గొర్రెలు అక్కడికి అక్కడే మృతిచెందాయి.