Buses Collide CCTV: రెండు బస్సులు ఢీ.. 52 మందికి గాయాలు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్‌ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్‌ తన సీట్లో […]

Published By: HashtagU Telugu Desk
CCTV

CCTV

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్‌ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్‌ తన సీట్లో నుంచి ముందుకు ఎగిరిపడటం, బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడం వీడియోలో  కనిపిస్తోంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది.

 

  Last Updated: 18 May 2022, 12:50 PM IST