Site icon HashtagU Telugu

Bark Like Dog : అలా వేధించారని.. ముగ్గురి ఇళ్ల కూల్చివేత

Bark Like Dog

Bark Like Dog

Bark Like Dog :  ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని చుట్టుముట్టి.. అతడి మెడకు కుక్క తాడును కట్టి.. కుక్కలా మొరుగు అని వేధించిన ఘటనను మధ్యప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించిన 48 సెకన్ల వీడియో క్లిప్ పై ర్యాపిడ్ గా రియాక్ట్ అయింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు సమీర్, సాజిద్, ఫైజాన్‌ అనే ముగ్గురు నిందితుల ఇళ్ళపై సోమవారం అధికారులు బుల్డోజర్ యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు దగ్గరుండి మరీ నిందితుల ఇళ్లను కూల్చివేయించారు.

Also read : US Dog: అతి పొడవైన నాలుకతో గిన్నిస్ రికార్డు సృష్టించిన కుక్క.. ఫోటోస్ వైరల్?

అంతకుముందు బాధితుడు విజయ్ రామచందానిని వేధించినందుకు(Bark Like Dog) ముగ్గురు యువకులపై జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించారు. దీనితో పాటు మత స్వేచ్ఛ చట్టం, అపహరణ, బంధించడం, ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టడం వంటి అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటికి వచ్చి వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. డ్రగ్స్ తాగాలని, మాంసం తినాలని, మతం మారాలని ఆ ముగ్గురు నిందితులు బలవంతం చేశారని విజయ్ రామచందాని కుటుంబం ఆరోపించింది.