Site icon HashtagU Telugu

3 Terrorists Killed : జ‌మ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదుల హ‌తం

Jammu Encounter

Jammu Encounter

జమ్మూ కాశ్మీర్‌లోని సిధ్రాలో భద్రతా బలగాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉన్నారని J-K ADGP తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన తెలిపారు. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED)ని పోలీసులు నిన్న (మంగ‌ళ‌వారం) నిర్వీర్యం చేశారు. సోమవారం బసంత్‌గఢ్ ప్రాంతంలో ఒక స్థూపాకార ఆకారంలో ఉన్న IED, 300-400 గ్రాముల RDX, ఏడు 7.62 mm కాట్రిడ్జ్‌లు మరియు ఐదు డిటోనేటర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు.