Site icon HashtagU Telugu

IPL 2022: దీపక్ చాహర్ రీప్లేస్ మెంట్ వీళ్ళే

Deepak Chahar

Deepak Chahar

ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్‌ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకి కొనుగోలు చేసిన స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్.. ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు.
గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడుతూ దీపక్ చాహర్ గాయపడ్డాడు.. దాంతో.. ప్రస్తుతం అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు.. ఇక దీపక్ చాహర్.. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం 8 వారాల సమయం పడునున్నట్లు తెలుస్తోంది..

ఒక వేళ తొలి దశ సీజన్‌కు దీపక్ చహర్‌ దూరమైతే మాత్రం సీఎస్‌కే భారీ మొత్తంలో నష్టపోనుంది. గతేడాది ఐపీఎల్‌లో దీపక్ చహర్‌ చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుమ్మురేపాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్‌ గెలవడంలో దీపక్‌ చహర్‌ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక గాయం కారణంగా చహర్‌ దూరమవడంతో అతనికి రీప్లేస్‌మెంట్‌ విషయంపై సీఎస్‌కే ఫ్రాంచైజీ ప్రస్తుతం దృష్టి సారించింది.. అయితే ప్రస్తుతం బ్యాట్తోనూ రాణించగల పేసర్ దొరకడం కష్టమే అయినా ఓ ముగ్గురు ఆటగాళ్లను అతడి స్థానంలో తీసుకునే ఛాన్స్ ఉంది..

ఈ జాబితాలో సందీప్ వారియర్, ఇషాంత్ శర్మ, అర్జాన్ ఉన్నారు.. ఈ ముగ్గురు కూడా మెగావేలంలో అమ్ముడుపోని ఆటగాల్లుగా మిగిలారు. వీరిలో సందీప్ వారియర్ విషయానికొస్తే.. అతడి స్వింగ్ నైపుణ్యం పవర్ప్లేలో ఉపయోగపడుతుంది. ఆడిన 63 టీ20ల్లో అతడి ఎకానమీ రేట్ 7.28గా ఉంది. అలాగే అర్జాన్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్.. విదేశాల్లో టీమ్ఇండియాకు నెట్బౌలర్గానూ సేవలందించాడు. ఇప్పటివరకు ఆడిన 20 టీ20ల్లో 28వికెట్లు తీశాడు.ఇక ఇషాంత్ శర్మ విషయానికొస్తే.. జట్టుకి ఇషాంత్ అనుభవం ఉపయోగపడుతుందని తీసుకునే ఛాన్స్ ఉంది.