Medical Student: ఇదేందయ్యా ఇది.. కాబోయే డాక్టర్ ఇంట్లో గంజాయి మొక్కలు.. ఎక్కడంటే?

తాజాగా కర్ణాటకలో కాబోయే డాక్టర్ అతి తెలివితేటలను ఉపయోగించి ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగును మొదలుపెట్టేశాడు. హైటెక్ పద్ధతులను పాటిస్తూ పక్కింట

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 05:16 PM IST

తాజాగా కర్ణాటకలో కాబోయే డాక్టర్ అతి తెలివితేటలను ఉపయోగించి ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగును మొదలుపెట్టేశాడు. హైటెక్ పద్ధతులను పాటిస్తూ పక్కింటి వాళ్లకు కూడా అనుమానం రాకుండా మొక్కలు పెంచుతున్నాడు. అతనికి తోడుగా మరొక ఇద్దరిని కలుపుకుని కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్మడం మొదలు పెట్టాడు. డాక్టర్ గా రోగులకు సేవ చేయాల్సిన వాడు కాస్త చెడు మార్గంలో నడిచాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యాడు. కాగా పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కర్ణాటక లోని శివమొగ్గకు చెందిన విఘ్నరాజ్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రం చదువుతున్నాడు. డబ్బు సంపాదించాలనే కోరికతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. అధునాతన పద్ధతులలో ఇంట్లోనే గంజాయి సాగుకు పూనుకున్నాడు. దీనికోసం ఇంట్లో ప్రత్యేకంగా ఒక సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా పెంచిన గంజాయిని పండిదొరై, వినోద్ కుమార్ ల సహాయంతో కాలేజీ విద్యార్థులకు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో పక్కా ప్లాన్ తో పోలీసులు విఘ్నరాజ్ ఇంట్లో సోదాలు జరిపారు.

లోపల సెటప్ చూసి పోలీసులే అవాక్కయ్యారట. చుట్టూ పరద చుట్టి, లోపల వేడి కోసం లైట్లు, గాలి కోసం ఫ్యాన్ ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. విఘ్నరాజ్ ఇంట్లో జరిపిన సోదాల్లో 227 గ్రాముల గంజాయి, 1.53 గ్రాముల పచ్చి గంజాయి, 10 గ్రాముల చరస్‌లు, గంజాయి విత్తనాలతో కూడిన చిన్న సీసాలతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డాక్టర్ గా మారి వైద్య సేవలు చేయాల్సింది పోయి చెడు మార్గంలో ఆలోచించి కటకటాల పాలయ్యాడు.