Site icon HashtagU Telugu

Viral Video: కదులుతున్న రైలు నుంచి ముగ్గురు యువతులు జంప్…వైరల్ వీడియో!!

train girls

train girls

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో ముగ్గురు యువతులు కదులుతున్న ట్రైన్ నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందికి దూకారు. కదులుతున్న ట్రైన్ నుంచి యువతులు దూకి…తమ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిన ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జోగేశ్వరి రైల్వే స్టేషన్ కు చెందినదని ఐపీఎస్ కైజర్ ఖలీద్ తెలిపారు.

లోకల్ రైలులో ఉన్న యువతి కిందకు దిగే ప్రయత్నం చేసింది. ఇంతలోనే రైలు కదులుతుండటంతో ఫ్లాట్ ఫాంపై పడింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకముందే ఓ హోంగార్డు ఆ యువతిని రక్షించాడు. ఇదంతా కూడా రైల్వే స్టేషన్ లోని సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఐపీఎస్ షేర్ చేసిన ఈ వీడియోలో స్టేషన్ నుంచి లోకల్ రైలు ఎలా బయలుదేరుతుందో క్లియర్ గా చూడవచ్చు. అయితే రైలు వేగం పెరగడంతో ఓ యువతి రైలు నుంచి కిందకు దూకింది. బ్యాలెన్స్ తప్పడంతో ఫ్లాట్ ఫాంపై పడిపోయింది. గమనించిన హోం గార్డు పరుగెత్తి రైలు కింద పడకుండా కాపాడాడు. ఇంతలోనే మరో ఇద్దరు యువతులు కూడా రైలు నుంచి దూకడం కనిపించింది. గార్డును జీఆర్పీ సైనికుడు అల్తాఫ్ షేక్ . ఎంతో అప్రమత్తంగా వ్యవహారించి ముగ్గురు యువతులను కాపాడినందుకు అల్తాఫ్ ను సన్మానించారు.

 

Exit mobile version