Telangana: విద్యాశాఖలో అవినీతి తిమింగలం

విద్యాశాఖలో అవినీతి తిమింగలం పట్టుబడింది. పాఠశాల ఎన్ఓసి విషయంలో ఓ అధికారి రూ.80,000 డిమాండ్ చేయడంతో అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Telangana: విద్యాశాఖలో అవినీతి తిమింగలం పట్టుబడింది. పాఠశాల ఎన్ఓసి విషయంలో ఓ అధికారి రూ.80,000 డిమాండ్ చేయడంతో అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే.. గురువారం పాఠశాల విద్యాశాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు రూ.80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఏ సాయి పూర్ణ చందర్‌రావు అవినీతి కేసులో పట్టుబడ్డాడని తెలిపారు. ఆయన రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలంలో ఉన్న ఒక పాఠశాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఎన్ఓసి ఫైల్‌ పై సంతకం కోసం 80,000 లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. ఇదే కేసులో శేఖర్, సతీష్‌ లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Also Read: YV Subba Reddy : విశాఖ అందుకే.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే ఆలస్యం అయింది.. రాజధానిపై వైవి సుబ్బారెడ్డి..