ఇండియన్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్ ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మరణించారు.
“ఈరోజు ముంబైలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన దురదృష్టకర సంఘటనలో, INS రన్‌వీర్‌లోని అంతర్గత కంపార్ట్ మెంట్‌లో పేలుడు కారణంగా ముగ్గురు నావికాదళ సిబ్బంది గాయపడ్డారు” అని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. పెద్దగా వస్తు నష్టం ఏమీ జరగలేదని, పేలుడుకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి పేలుడుకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కారణాలపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించింది. ఓడ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
