Site icon HashtagU Telugu

3 Died: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 3 మృతి!

Crime

తెలంగాణలోని (Telangana) మహబూబ్‌నగర్ జిల్లాలో గత రెండు రోజుల్లో కల్తీ (Toddy) కల్లు సేవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. అయితే కల్తీకి అవకాశం లేదని ఎక్సైజ్ అధికారులు తేల్చి చెప్పారు. కోడేరు గ్రామానికి చెందిన ఏసన్న (52) సోమవారం రాత్రి మృతి చెందగా, అంబేద్కర్ కాలనీకి చెందిన విష్ణు ప్రకాష్ (27), రేణుక (55) బుధవారం సాయంత్రం మృతి (Died) చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతులు మహబూబ్‌నగర్ (Mahabubnagar) ప్రభుత్వాసుపత్రిలో ఉండగా, మరో 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆసుపత్రిలో (Hospital) చేరారని, కల్తీ మద్యం బారిన పడిన లక్షణాలు కనిపించలేదు” అని వైద్యులు (Doctors) తెలిపారు. ఈ ఘటనకు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Corona Cases: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!