Site icon HashtagU Telugu

Train Derailed: పట్టాలు తప్పిన పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు..!!

Train Imresizer

Train Imresizer

ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి దాదార్-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ కోచ్ లు పట్టాలు తప్పాయి. ట్రాక్ పై మరొక రైలును ఢీకొట్టింది. ఈ ఘటన అంతా కూడా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వెనక్కి వెళ్లు, తిరిగి రా, రైలు ఢీ కొట్టింది అని ఒక వ్యక్తి అరవడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

దాదార్ టెర్మినస్ నుంచి ట్రైన్ పుదుచ్చేరికి బయలుదేరిన కొద్దిసేపట్లోనే అంటే రాత్రి 9.45 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అద్రుష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.