Site icon HashtagU Telugu

Power Nap @ Work: మధ్యాహ్నం కునుకు.. ఉద్యోగుల పనితీరుకు చురుకు!!

Powernap

Powernap

మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మీకు ఆఫీసులో నిద్ర వస్తోందా ?

ఒక అరగంట దాకా కళ్ళు మూసుకుపోయి పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారా ? ఇలా ఆపసోపాలు పడే కంటే.. అరగంట పాటు కునుకు తీసి వచ్చి పనికి ప్రొసీడ్ అయితే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులకు మధ్యాహ్నం లంచ్ తర్వాత అరగంట కునుకు తీసే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తే , వాళ్ళ పనితీరు చాలా మెరుగు పడుతుందని అంటున్నారు. కునుకు తీసిన తర్వాత జ్ఞాపకశక్తి 5 రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు.

రెట్టించిన ఉత్సాహం తో ఉద్యోగి పనిచేసేందుకు ఈ వెసులుబాటు బాటలు వేస్తుందని పేర్కొంటున్నారు. ఉద్యోగి సృజనాత్మక కూడా పెరిగి, అప్పగించిన పనులను క్రియేటివ్ గా పూర్తి చేసే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు. కంపెనీ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తున్నందున ఉద్యోగులు.. మరింత శ్రద్ధ పెట్టి విధి నిర్వహణకు అంకితమవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “నాసా” నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని గుర్తు చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత అరగంట కునుకు తీసిన ఉద్యోగుల పనితీరు మునుపటి కంటే 33 శాతం మెరుగైందని నాసా రీసెర్చ్ లో వెల్లడైంద హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలోనూ ఇదే విధమైన ఫలితాలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ” వేక్ ఫిట్” ఈ సూత్రాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చింది.

మధ్యాహ్నం అరగంట నిద్రపోయేందుకు తమ ఉద్యోగులకు అవకాశం ఇస్తోంది. నాసా నివేదిక ఆధారంగానే తాము ఉద్యోగులకు ఈ వెసులుబాటును ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల మెరుగైన పనితీరు తమ ఉద్యోగుల్లో కనిపించిందని పేర్కొంది.

Exit mobile version