Site icon HashtagU Telugu

Earthquake: కొత్త సంవత్సరం రోజున కంపించిన భూమి

Philippines

Earthquake 1 1120576 1655962963

కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప తీవ్రతను అంచనా వేసింది. భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం (01-01-2023) తెల్లవారుజామున 1:19 గంటలకు హర్యానాలోని ఝజ్జర్ వాయువ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని లోతు భూమికి 5 కి.మీ. కేంద్రం నుంచి అందిన రీడింగ్ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

అంతకుముందు నవంబర్ 12న భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4 గా ఉంది. ఇది రాత్రి 7:57 గంటలకు నేపాల్‌లో వచ్చింది. భూకంపం లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అనేది దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ప్రకారం.. రోహ్తక్-ఝజ్జర్ గుండా వెళుతున్న మహేంద్రగఢ్-డెహ్రాడూన్ ఫాల్ట్ లైన్ దగ్గర తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి దీనిపై నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రత్యక్షంగా చూస్తుంది. ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పుడు, హర్యానాలో భూమికి కేవలం 5 కిలోమీటర్ల దిగువన ప్రకంపనలు నమోదయ్యాయి. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు ప్రజలు భావించారు.