Site icon HashtagU Telugu

Drunk & Driveడ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డుతున్న మందుబాబులు.. సైబ‌రాబాద్‌లో ఒక్క రోజులోనే.. !

Drunk Driving Imresizer

Drunk Driving Imresizer

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వ‌హించారు. వీకెండ్ కావ‌డంతో ఎక్కువ మంది ప‌బ్‌లు, బార్‌ల‌కు వెళ్లి తిరిగి వ‌స్తుంటారు. ఈ స‌మ‌యంలో చాలా మంది తాగి వాహ‌నాలు న‌డుపుతూ ప్ర‌మాదాల బారిని ప‌డుతున్నారు. దీన్ని నివారించ‌డానికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు చేప‌డుతున్నారు. సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌లో నిర్వ‌హించిన త‌నిఖీల్లో 283 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌లోని వివిధ నిర్దేశిత పాయింట్ల వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో కొన్ని వేల మంది వాహనదారులను పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో మొత్తం 283 మంది ప‌ట్టుబ‌డ్డారు. వారందరినీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని, సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.అక్టోబర్‌లో ఇప్పటివరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు 3,122 కేసులు నమోదు చేశారు. వీరిలో 1549 మందిని కోర్టులో హాజరుపరచగా వారికి రూ.50.77 లక్షల జరిమానా విధించారు. మొత్తం 35 మందికి జైలు శిక్ష పడింది.

Exit mobile version