Nigeria: బందిపోట్ల ఉచ్చులో నైజీరియా సైన్యం.. 26 మంది సైనికులు మృతి?

తాజాగా నైజీరియా భద్రతా దళాలు, బందిపోట్లకు మధ్య జరిగిన భీకర పోరులో దాదాపు 26 మంది సైనికులు మృతి చెందారు. సెంట్రల్‌ నైజీరియాలో సైన్యాన్ని బంద

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 04:01 PM IST

తాజాగా నైజీరియా భద్రతా దళాలు, బందిపోట్లకు మధ్య జరిగిన భీకర పోరులో దాదాపు 26 మంది సైనికులు మృతి చెందారు. సెంట్రల్‌ నైజీరియాలో సైన్యాన్ని బందిపోట్లు ఉచ్చులోకి లాగి దాడి చేశారు. దీంతో ఆ బృందం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కాగా ఈ దాడి తాజాగా ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. సోమవారం ఉదయం ఇక్కడి క్షతగాత్రులను కాపాడేందుకు వచ్చిన హెలికాప్టర్‌ను కూడా బందిపోట్లు కూల్చినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ పోరులో 26 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు.

జుంగేరు టిగెనా హైవే వద్ద జరిగిన ఈ దాడిలో మొత్తం ముగ్గురు ఆఫీసర్లు సహా 23 మంది సైనికులు, ముగ్గురు సివిలియన్‌ విజిలెంట్‌లు మృతి చెందారు. మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. మొదట11 మంది చనిపోగా, మరో 8 మంది గాయపడ్డారు. వారికి సహాయంగా ఎంఐ 171 హెలికాప్టర్‌ వెళ్లింది.

మృతదేహాలు, క్షతగాత్రులను తీసుకొని జుంగేరు ప్రాథమిక పాఠశాల ఆవరణ నుంచి బయల్దేరి వస్తుండగా షిరోరో వద్ద అది కూలిపోవడంతో అక్కడి వారితో కమ్యూనికేషన్లను కోల్పోయాము అని అధికారి వెల్లడించారు. నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలో బందిపోట్ల దాడులు జరగని రోజు ఉండదు. ఈ గ్యాంగులు పాఠశాలపై దాడులు చేయడం, గ్రామాలపై పడి దోచుకోవడం ఇక్కడ నిత్య కృత్యం. వీరికి అడ్డు వస్తే ఇళ్లను దహనం కూడా చేసేస్తారు.