Two Trains Collide: రెండు రైళ్లు ఢీ.. 26 మంది మృతి.. ఎక్కడంటే..?

గ్రీస్ (Greece)​ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రీస్‌లోని అథెన్స్​‌కు 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్​ రైలు, మరో గూడ్స్​ రైలును ఢీకొట్టింది.

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 08:52 AM IST

గ్రీస్ (Greece)​ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రీస్‌లోని అథెన్స్​‌కు 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్​ రైలు, మరో గూడ్స్​ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా (26 Dead).. మరో 85 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

గ్రీస్‌లో రెండు రైళ్ల మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 16 నుంచి 26కి పెరిగింది. ఈ ప్రమాదంలో 85 మంది గాయపడినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మీడియా కథనాలు ప్రకారం ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జరిగింది.

Also Read: North Korea: కిమ్ మరో సంచలన నిర్ణయం.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే..!

ప్రమాదానికి గల కారణాలేంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదం గురించి గ్రీస్‌లోని థెస్సాలీ ప్రాంత గవర్నర్ మాట్లాడుతూ.. ఏథెన్స్ నుండి ఉత్తర నగరమైన థెస్సలోనికికి ప్యాసింజర్ రైలు వెళ్తుండగా, థెస్సలోనికి నుండి లారిస్సాకు మరో గూడ్స్ రైలు వస్తోందని తెలిపారు. ఈ రెండు రైళ్లు లారిస్సా నగరం వెలుపల ఢీకొన్నాయి.

ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని అమలు చేయగా, రెస్క్యూలో సహాయం చేయడానికి సైన్యాన్ని పిలిపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రైలు కోచ్‌లు మంటల్లో ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇది కాకుండా కొన్ని కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి.