Telangana High Court : అయోమయంలో 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

బిఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్ లో

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 07:34 PM IST

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసిన బిఆర్ఎస్ (TRS) హ్యాట్రిక్ ఫై కన్నేసింది. మరోపక్క కర్ణాటక విజయంతో జోష్ లో ఉన్న కాంగ్రెస్..తెలంగాణలో విజయం సాధించాలనే కసిగా ఉంది. ఇక బిజెపి కూడా అంతే విధంగా విజయం ఫై ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో సంక్షేమ పధకాలు , అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న బిఆర్ఎస్ కు పెద్ద తలనొప్పి వచ్చిపడింది.

బిఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై తుది తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు సిద్దమవుతున్నట్లు వస్తున్న వార్తలు పార్టీ అధిష్టానాన్ని , సదరు ఎమ్మెల్యేలను అయోమయంలో పడేస్తుంది. రీసెంట్ గా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు (Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం (Telangana High Court) ఈ మేరకు తీర్పును వెలువరించింది. వనమా బాటలోనే ఇప్పుడు మరో 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులు హైకోర్టు లో పెండింగ్ లో ఉన్నాయి.

ఆగస్ట్ 12 నుంచి 17 వరకూ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హై‌కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో మరికొందరు నేతల ఎలక్షన్ పిటిషన్‌లు విచారణకు రానున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే.. ఈనెలాఖరుకల్లా మొత్తం 26 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి అనేది తేలనుంది. మరి వీరిలో ఎవరి పదవి ఉంటుందో…ఏవారి పదవి ఉడుతుందో చూడాలి.

హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న ఆ 26 మంది ఎవరు అనేది చూస్తే..

* అసిఫాబాద్ :- ఆత్రం సక్కు Vs కోవా లక్ష్మి

* ఖైరతాబాద్ :- దానం నాగేందర్ Vs దాసోజు శ్రవణ్

* వేములవాడ :- చెన్నమనేని రమేష్ బాబు Vs ఆది శ్రీనివాస్

* సికింద్రాబాద్ :- పద్మారావు Vs కాసాని జ్ఞానేశ్వర్

* గద్వాల్ :- కృష్ణమోహన్ రెడ్డి Vs డీకే అరుణ

* మహబూబ్‌నగర్ :- శ్రీనివాస్ గౌడ్ Vs చంద్రశేఖర్

* పటాన్ చెరు :- మహిపాల్ రెడ్డి Vs కాట శ్రీనివాస్ గౌడ్

* కొడంగల్ :- పట్నం నరేందర్ రెడ్డి Vs రేవంత్ రెడ్డి

* ఇబ్రహీంపట్నం :- మంచిరెడ్డి కిషన్ రెడ్డి Vs మల్‌రెడ్డి

* తుంగతుర్తి :- గ్యాదరి కిషోర్ Vs అద్దంకి దయాకర్

* దేవరకద్ర :- ఆల వెంకటేశ్వర్ రెడ్డి Vs పవన్ కుమార్

* వరంగల్ ఈస్ట్ :- నరేందర్ Vs రవీందర్

* మంచిర్యాల :- ప్రేమ్‌సాగర్ రావు Vs దివాకర్ రావు

* హుస్నాబాద్ :- సతీష్ Vs చాడ వెంకటరెడ్డి

* ఆలేరు :- గొంగడి సునీత Vs సతీష్

* జూబ్లీహిల్స్ :- మాగంటి గోపీనాథ్ Vs విష్ణువర్ధన్ రెడ్డి

* కోదాడ :- బొల్లం మల్లయ్య Vs ఉత్తమ్ పద్మావతి

* నాగర్‌కర్నూల్ :- మర్రి జనార్ధన్ Vs నాగం జనార్ధన్

* గోషామహల్ :- రాజాసింగ్ Vs ప్రేమ్‌సింగ్ రాథోడ్

* వికారాబాద్ :- మెతుకు ఆనంద్ Vs గడ్డం ప్రసాద్

* పరిగి :- మహేశ్వర్ రెడ్డి Vs రామ్మోహన్ రెడ్డి

* జనగాం :- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి Vs పొన్నాల లక్ష్మయ్య

* నాంపల్లి :- జాఫర్ హుస్సేన్ Vs ఫిరోజ్ ఖాన్‌

* మల్కాజ్‌గిరి :- మైనంపల్లి హన్మంత్ Vs రామచందర్ రావు

* కరీంనగర్ : గంగుల కమాలకర్ Vs బండి సంజయ్

* ధర్మపురి :- కొప్పుల ఈశ్వర్ Vs అడ్లూరి లక్ష్మణ్

Read Also : AP BRS: సంక్షేమం పేరుతో ఏపీలో సంక్షోభ పాలన: బీఆర్ఎస్ చీఫ్ తోట ఫైర్