250 Kg Ganja: భద్రాద్రిలో కారు బోల్తా…క్లియర్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్..!!

భద్రాద్రి జిల్లాలో గంజాయి కలకలం రేగింది. బోల్తా పడిన కారులో భారీఎత్తున గంజాయి బయటపడింది.

Published By: HashtagU Telugu Desk
Car Imresizer

Car Imresizer

భద్రాద్రి జిల్లాలో గంజాయి కలకలం రేగింది. బోల్తా పడిన కారులో భారీఎత్తున గంజాయి బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 390 కిలోల గంజాయిని గుర్తించారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాక్సిడెంట్ అయ్యింది. బూర్గంపహడ్ మండలం సారపాకలోని భద్రాచలం బ్రిడ్జ్ సమీపంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓ కారు బోల్తా పడింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది.

బోల్తాపడిన కారులో పెద్దెత్తున గంజాయిని గుర్తించారు పోలీసులు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ తోపాటు కారులోని వ్యక్తులంతా పరారయ్యారు. కారు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. కారు లోని గంజాయి ఎక్కడ నుంచి వస్తోంది. ఎక్కడికి తరలిస్తున్నారు. ఎవరు తరలిస్తున్నారు. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

  Last Updated: 01 May 2022, 11:37 PM IST