Site icon HashtagU Telugu

25 People Died : బస్సులో మంటలు.. 25 మంది సజీవ దహనం

25 People Died

25 People Died

25 People Died : మహారాష్ట్రలోని బుల్దానా సిటీ పరిధిలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  యావత్‌మాల్ నుంచి పూణెకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న 25 మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్ ను బస్సు ఢీకొట్టిన తర్వాత బోల్తా పడటంతో.. ఇంధనం లీకేజీ జరిగి అందులో మంటలు చెలరేగాయని అంటున్నారు.

Also read : Modi- Amit shah: యాక్ష‌న్‌లోకి అమిత్ షా, న‌డ్డా.. ఆరోజే ఫుల్ క్లారిటీ వ‌చ్చేస్తోందా?

బస్సు నుంచి 25 మృతదేహాలను(25 People Died) వెలికితీశారు. అందులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. మిగితా  8 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వారిని బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు బుల్దానా పోలీస్ డిప్యూటీ ఎస్పీ బాబూరావు మహాముని వెల్లడించారు.