Cyber Crime: ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్, 25 లక్షల మోసం

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 10:59 PM IST

Cyber Crime: తెలంగాణలో సైబర్ నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్ పూర్ లోని భవానిపురం కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ స్పందించి. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు.

దీంతో ఉద్యోగి దఫాలుగా డబ్బులు చెల్లించాడు 15 లక్షల 37 వేలు చెల్లించగా సైబర్ నేరగాళ్లు కమిషన్ చూపెట్టగా కమిషన్ ఇవ్వాలని అడగగా సైబర్ నేరగాళ్లు స్పందించకపోవడంతో డబ్బులు మోసపోయాడు. హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీకి చెందిన అడ్వకేట్ నకిలీ ఆన్ లైన్ ట్రేడింగ్ తో రూ.25 లక్షల 71 వేలు పోగొట్టుకున్నాడు. జనవరి 8వ తేదీన ట్రేడింగ్ కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది.

దీంతో అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ఆన్ లైన్ ట్రేడింగ్ లో అకౌంట్ కోసం తన వివరాలను యాప్ లో నమోదు చేశాడు. దీంతో అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఒక ఐడి ని క్రియేట్ చేసి ఇచ్చారు.దీంతో ఆ అడ్వకేట్ నగదు ను ఆన్ లైన్ ఇన్వెస్ట్ చేస్తు వచ్చాడు. పెట్టిన నాగధు తో పాటు, లాభాలు చూపిస్తూ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అయితే బాధితుడు పలు దఫాలుగా రూ.25 లక్షల 71 వేలు ఇన్వెస్ట్ చేసి, తాను పెట్టిన నగదు తో పాటు వచ్చిన లాభాలను ఇవ్వాలని అడగగా అపరిచిత వ్యక్తులు స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించారు.