Site icon HashtagU Telugu

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో టెన్ష‌న్.. స్వదేశానికి 242 మంది భారతీయులు

Ucrain Rashya

Ucrain Rashya

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక మొదలయింది. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేకవిమానం, తాజాగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుందని విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్‌లో సైనికుల మొహరింపు, యుద్ధ విన్యాసాలతో అక్క‌డ యుద్ద వాతావ‌ర‌ణం ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేసేందుకు స‌మాయ‌త్తం అవుతుంద‌ర‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో భారత్ తమ పౌరులను వెనక్కు రమ్మని పిలుపునిచ్చింది. ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు, విద్యార్థులు ఉక్రెయిన్​ నుంచి దిల్లీకి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు తీవ్ర‌త‌రం అవ‌తున్న క్ర‌మంలో, అక్క‌డి ఇండియ‌న్స్ స్వదేశానికి వచ్చేందుకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 22, 24, 26తేదీల్లో 3ప్రత్యేక వందేభారత్ విమానాలను ఉక్రెయిన్, భారత్ మధ్య నడపనున్నట్లు ఎయిర్​ ఇండియా ప్రకటించింది.