ఉత్తర ఢిల్లీలోని రోహిణి జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై 24 ఏళ్ల యువకుడు జిమ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు గురువారం తెలిపారు. అయితే ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలిపారు. సాక్షం అనే వ్యక్తి రోహిణి సెక్టార్ 15లోని జిమ్‌లో ట్రెడ్‌మిల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు స్పృహతప్పి పడిపోయాడు. దీంతో సమీపంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత అతను చనిపోయినట్లు ప్రకటించారు.
మృతిపై పోలీసులకు సమాచారం అందించామని, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని చెప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే శవపరీక్షలో అతను విద్యుదాఘాతం కారణంగా మరణించాడని స్పష్టమైంది. యంత్రాల వాడకంలో నిర్లక్ష్యమే మరణానికి కారణమైన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జిమ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. “విచారణ జరుగుతోంది” అని అధికారి తెలిపారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మహిళలు బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగ తగలకుండా ఉండేలా చూసుకోవాలి. తడి చేతులతో కరెంటు స్విచ్ లు ఆన్, ఆఫ్ చేయకూడదు. ఇంట్లో ఎక్కడైనా విద్యుత్ తీగలకు జాయింట్స్ ఉంటే వాటిని ఒకసారి ఎలక్ట్రీషియన్ తో మార్పించుకోవాలి. రహదారి వెంట ఉన్నటువంటి విద్యుత్ పోల్స్ ను పొరపాటున కూడా తాకకూడదు. విద్యుత్ తీగ సర్వీస్ వైర్ కు సపోర్ట్ గా ఉండే జి వైర్ ప్లాస్టిక్ తొడుగు ఉండేలా చూసుకోవాలి. తెగి పడిపోయినా, ఎత్తు తక్కువగా ఉన్న కరెంటు తీగలను తాకకూడదు.
Also Read: Trolls On ‘Project K’: ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’పై ట్రోల్స్.. మరో ఆదిపురుష్ అంటూ కామెంట్స్!