Site icon HashtagU Telugu

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పిడుగుపాటుకు 24 మేకలు మృతి

Lightning

Lightning 1280p

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో పిడుగుపాటుకు 24 మేకలు మృతి చెందాయి. జిల్లా విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరకాశీ జిల్లాలోని కమర్ గ్రామ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తీసిన వీడియోలలో దృశ్యాన్ని బ‌ట్టి చూస్తే పచ్చని చెట్టుపై పిడుగు ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. పిడుగు ప‌డే స‌మ‌యంలో చెట్ల చుట్టూ తిరుగుతున్న మేకలు విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో నిన్న‌(బుధ‌వారం) ఈ రోజు (గురువారం) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. గురువారం వరకు ఉరుములు, మెరుపులు మరియు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు (గురువారం) ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.