Bengaluru: ర్యాపిడిలో వాహనాన్ని బుక్ చేసుకున్న వ్యక్తి.. ఏకంగా అన్ని నిమిషాల పాటు వెయిటింగ్.. చివరికి?

ప్రస్తుత కాలంలో ఎక్కడకి వెళ్లాలి అన్న కూడా సొంత వాహనాలు లేకపోయినా కూడా ఈజీగా ప్రయాణించవచ్చు. కార్లు, ఆటోలు, బైక్లు బుక్ చేసుకునే సదుపాయాలు అ

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 03:18 PM IST

ప్రస్తుత కాలంలో ఎక్కడకి వెళ్లాలి అన్న కూడా సొంత వాహనాలు లేకపోయినా కూడా ఈజీగా ప్రయాణించవచ్చు. కార్లు, ఆటోలు, బైక్లు బుక్ చేసుకునే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమీపంలో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా వెంటనే వాటిని బుక్ చేసుకుంటూ ఉంటారు. చిన్న దానికి పెద్ద దానికి ప్రతి ఒక్క విషయానికి ఆన్లైన్లో వాహనాలను బుక్ చేసుకోవడం అన్నది కామన్ అయిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఉన్న ట్రాఫిక్ వల్ల ఆ వాహనాలు కొన్ని కొన్ని సార్లు రావడం ఆలస్యం కావచ్చు.

తాజాగా ఒక ప్రయాణికుడికి అలాంటి చేదు అనుభవం ఎదురయింది. 45 నిమిషాల ప్రయాణం కోసం 225 నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చిందని తెలిపాడు సదరి వ్యక్తి. కాగా బెంగుళూరులో ఒక ఓ వ్యక్తికి ఈ ఆన్‌లైన్‌ సేవలో చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్న అతడు కేవలం 45 నిముషాల ప్రయాణం కోసం 225 నిముషాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా బెంగుళూరు ట్రాఫిక్ కథనాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. అలాంటి బెంగుళూరు ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఆమాత్రం సమయం వెయిటింగ్ చేయక తప్పదు మరి..

 

దీంతో విసుగొచ్చిన ఆ యువకుడు అందుకు సంబంధించిన ఫోటోలను నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వెయిటింగ్ సమయాన్ని చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది కామెంట్ల రూపంలో ఈ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. ఆ వెయిటింగ్ సమయంలో ఎంచక్కా ఎక్కువ నిడివి ఉన్న హాలీవుడ్ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది అలాంటి సిటీలలో ఉండే ట్రాఫిక్ గురించి మండిపడుతున్నారు.