Maruti WagonR: లేటెస్ట్ ఫీచర్లతో వ్యాగన్ ఆర్….లాంచ్ కు ముందే ఫీచర్స్ ఔట్..!!!

దేశంలోని అతిపెద్ద వాహన తయారుదారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త మోడల్ వాగన్ ఆర్ కారును లాంచ్ చేసింది. 2022మోడల్ లో ఈ కారును రిలీజ్ చేసింది. ఇందులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

  • Written By:
  • Updated On - March 17, 2022 / 12:21 PM IST

దేశంలోని అతిపెద్ద వాహన తయారుదారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త మోడల్ వాగన్ ఆర్ కారును లాంచ్ చేసింది. 2022మోడల్ లో ఈ కారును రిలీజ్ చేసింది. ఇందులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. అయినప్పటికీ ఫీచర్లలో మాత్రం చాలా మార్పులు చేసింది కంపెనీ. ఇక ఇంజిన్ లో చేసిన మార్పులతో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయనుంది. ఇక మైలేజ్ విషయంలోనూ దిబెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ కారు ఆటోమేటిక్ మాన్యువల్ తోపాటు సీఎన్జీ మోడల్ లోనూ లభిస్తోంది.

ఇక కొత్త వాగన్ ఆర్ మోడల్ కారులో రూ. 12వేలు అదనంగా చెల్లించినట్లయితే ప్రీమియం డ్యుయల్ టోన్ ట్రీట్ మెంట్ వస్తుంది. కారులోపల 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేతోపాటుగా స్మార్ట్ ప్లే స్టూడియో, 4 స్పీకర్లు, క్లౌడ్ ఆధారిత సర్వీసులు, స్మార్ట్ ఫోన్ ఆధారిత నావిగేషన్ ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి. ఇక నిర్దిష్టమైన ప్రమాణాల ప్రకారం సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ అందిస్తున్నారు. వీటితోపాటుగా ఈబీడీ, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ , ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ను కూడా అందిస్తున్నారు.

2022మోడల్ వాగర్ ఆర్ లో డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్ ఉంది. 1.0, 1.2 లీటర్ మోడల్స్ లోనూ లభిస్తోంది. 67బీహెచ్ పీ కెపాసిటీలు ఉండనున్నాయి. జడ్ ఎక్స్ ఐ , జడ్ ఎక్స్ ఐ ప్లస్ మోడల్స్ లో 1.2 లీటర్ల ఇంజిన్ లభిస్తోంది. 1.0 లీటర్ ఇంజిన్ మోడల్ లో సీఎన్జీ ఆప్షన్ కూడా అందిస్తున్నారు. ఈ మోడల్ ఎల్ ఎక్స్ ఐ, వీఎక్స్ ఐ వేరియంట్లలో లభిస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్స్ లో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కొత్త మోడల్ కారు 1.0లీటర్ ఇంజిన్ సుమారుగా 25కిలోమీటర్ల మేర మైలేజిని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.