Site icon HashtagU Telugu

Honda: సూపర్ బైక్ కొనాలని ఉందా…హొండా నుంచి లేటెస్ట్ బైక్…16 లక్షలు మాత్రమే..!!

2022 Honda Africa Twin Imresizer

2022 Honda Africa Twin Imresizer

భారత్ లో ఆటోమొబైల్ రంగం మళ్లీ ఊపందుకుంది. అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా ఈ మధ్యే 2022 ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. 2022 ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ప్రారంభ ధర రూ. 16.1 లక్షలు. ఈ స్పోర్ట్స్ బైక్ మాన్యువల్ వేరియంట్ రూ. 16.01 లక్షలు. కాగా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ ధర రూ. 17.55లక్షలు.

ఈ హోండా 2022 ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్స్ ను గురుగ్రామ్, ముంబై, బెంగుళూరు, ఇండోర్, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలలో లాంచ్ చేసింది. 2022ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైక్ ఆకర్షణీమైన కలర్స్ లో రిలీజ్ చేయబడ్డాయి. ఈ బైక్ లో 24.5లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. 1082.96 సీసీ పవర్ ఇంజన్ ఉంది. ఇది 7,500ఆర్ఫిఎం వద్ద 97.9 బిహెచ్ఫి గరిష్ట శక్తిని, 104ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైక్ మాన్యువల్, dctగేర్ బాక్సులను కలిగి ఉంది. ఈ బైక్ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ HSTC, బ్లూటూత్ కనెక్టివిటితో పరిచయం చేయబడింది. బైక్ లో 4 డిఫాల్ట్ రైడింగ్ మోడల్స్ ఉన్నాయి. టూర్ , అర్బన్, గ్రావెల్, ఆఫ్ రోడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మోటార్ సైకిల్ లో డ్యూయల్ LED హెడ్ లైట్స్, డేటైం రన్నింగ్ లైట్స్ ఉన్నాయి

Exit mobile version