Site icon HashtagU Telugu

2000 Notes Floating: పారుతున్న నదిలో తేలుతున్న నోట్లకట్టలు…ఎక్కడంటే..!!

Notes

Notes

అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్ల కట్టలు పడ్డాయన్న వార్తలు వింటుంటాం. అయితే నీటిలో కరెన్సీ కట్టలు కొట్టుకురావడం సంచలనంగా మారింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో అనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల నోట్ల కట్టలు తేలియాడుతూ రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నోట్ల కట్టలు పాలిథీన్ బ్యాగుల్లో ఉండటం…ఆ సంచిలో సుమారు ముప్పై నుంచి 32నోట్ల కట్టలు ఉన్నాయి. అవన్నీ కూడా 2వేల రూపాయల నోట్లే అని అధికారులు తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పుష్కర్ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అక్కడకు వెళ్లి చూసి…నకిలీ నోట్లా..అసలు నోట్లా అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. చూడటానికి నిజమైన నోట్ల వలే ఉండటంతో…నిర్దారించుకోవడం కష్టంగా ఉందన్ని చెప్పారు. నిపుణుల సాయంతో అసలా…నకిలా అనే విషయాన్ని తెలుసుకుంటామన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.