Site icon HashtagU Telugu

Honour Killing: యూపీలో దారుణం.. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని దారుణంగా అలా?

Honour Killing

Honour Killing

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. మనుషులు మానవత్వాన్ని మరిచి పరువు కోసం ఎదుటి వ్యక్తులను అతి దారుణంగా చంపేస్తున్నారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో పరువు హత్య కేసులు కలకలం రేపిన విషయం తెలిసిందే. దారుణంగా నడిరోడ్డు పైనే హత్య చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా మరో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. వేరే కులం వ్యక్తిని పెల్లాడినందుకు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది..

ఈ ఘటన పినావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బజ్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతకి అదే గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో సంబంధం ఉందని పారిపోయి వివాహం చేసుకుంది అనే సీతా పూర్ అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎన్పి సింగ్ తెలిపారు. సదరు మహిళా తన మేనమామ ఇంట్లో నివాసం ఉండేది. అయితే చంద్రమౌర్యకు గతంలోనే పెళ్లి జరిగింది. అయినప్పటికీ ఆ మహిళ అతనితో సంబంధం పెట్టుకుంది. అందులోనూ అతనిది వేరే కులం కావడంతో ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న సదరు మహిళలమైన మామ శ్యాము సింగ్ సదరు మహిళకి మందలించి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. అనంతరం తన తండ్రి పుతాన్ సింగ్ తోమర్ దగ్గరకు పంపించాడు.

సదరు మహిళా ఘజియాబాద్ లో ఉంటోందని తెలుసుకున్న ఆమె ప్రియుడు చంద్రమౌర్య రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. గత ఏడాది ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.. అలా నెలలు గడిచిన తర్వాత ఇటీవలె మౌర్యం సదరు మహిళ ఇద్దరు కలిసి బజ్ నగర్ గ్రామానికి వెళ్లి కొత్తగా కాపురం మొదలుపెట్టారు. ఆ విషయం తెలుసుకున్న శ్యాము సింగ్ కోపంతో ఊగిపోయాడు. తాజాగా శనివారం రోజు మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆమెను ఇంటి బయటకు తీర్చుకొచ్చి కొడవలితో కోసి చంపేశాడు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే హత్య చేసిన అనంతరం ఆ ఆయుధం పట్టుకొని పిసావన్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.