Site icon HashtagU Telugu

No Make up Model: చరిత్రలోనే మొట్టమొదటిసారి.. మేకప్ లేకుండా మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలోకి?

Miss England Contestant

Miss England Contestant

సాదారణంగా స్త్రీలు రెడీ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటారో మనందరికీ తెలిసిందే. అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అందుకే మగవారు ఎక్కువగా ఈ అలంకరణ విషయంలో ఆడవారిని తిడుతూ ఉంటారు. గంటలకు గంటలు రెడీ అవుతూ ఉంటారు అని అరుస్తూ ఉంటారు. సాధన స్త్రీలే అలంకరణకి అంతసేపు సమయం తీసుకోగా మరి అందాల పోటీలో పాల్గొనే మహిళలు మరింత ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు.

జాతయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అయిన అందాల పోటీల్లో పాల్గొని స్త్రీలు కచ్చితంగా మేకప్ ను వేసుకుని కనిపిస్తారు. కానీ లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్‌ దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుకు బ్రేక్‌ వేసింది. ఈమె మిస్‌ ఇంగ్లాండ్‌ అందాల పోటీలో మేకప్‌ అనేది లేకుండా పాల్గొన్న తొలి మహిళగా నిలవడంతో పాటుగా,94 ఏళ్ల ఈ పోటీ చరిత్రను కూడా తిరగరాసింది ఈ అందాల సుందరి. ఇది ఇలా ఉంటే ఈమె తాజాగా ఈ పోటీల ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లింది.

కాగా 2019లో జరిగిన మిస్‌ ఇంగ్లాండ్‌ పోటీలో మేకప్‌ లేకుండా కంటెస్టెంట్లు పాల్గొనే ఒక రౌండ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేయగా ఆ పోటీలో ఓ యువతి ఇలా మేకప్‌ లేకుండా పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్‌ ఇంగ్లాండ్‌ కిరీటం కోసం అక్టోబర్‌ 17న జరిగే ఫైనల్స్‌లో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది. అయితే మేకప్ లేకుండా అందాల పోటీలో పాల్గొనడం పై చాలామంది మెలీసా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.