Fuel Depot Blast: నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్ దళాలు దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. నాగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం మాట్లాడుతూ.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు (Fuel Depot Blast) సంభవించి కనీసం 20 మంది మరణించారు. దాదాపు 300 మంది గాయపడ్డారని తెలిపారు. సోమవారం అర్థరాత్రి ప్రాంతీయ రాజధాని స్టెపానకెర్ట్ వెలుపల గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించిన తరువాత 13 మృతదేహాలు కనుగొనబడ్డాయి. తర్వాత ఏడుగురు మరణించినట్లు ఆరోగ్య విభాగం తెలిపింది. 290 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.
మూడు దశాబ్దాల వేర్పాటువాద పాలన తర్వాత భూభాగాన్ని పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గత వారం అజర్‌బైజాన్ వేగవంతమైన సైనిక ప్రచారాన్ని అనుసరించి వేలాది మంది నగోర్నో-కరాబాఖ్ నివాసితులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆర్మేనియాకు తరలివెళుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రాంత పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించింది. అయితే, పేలుడుకు కారణమేమిటనే సమాచారం తెలియరాలేదు.
Also Read: India Is Important : మాకు ఇండియా ప్రయోజనాలే ముఖ్యం.. చైనా నౌకను రానిచ్చేది లేదు : శ్రీలంక
నాగోర్నో-కరాబాఖ్ వివాదాస్పద ప్రాంతం విషయంలో అజర్‌బైజాన్-ఆర్మేనియా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడి ఆర్మేనియా సైనిక దళాలపై అజర్ బైజాన్ దళాలు దాడులు స్టార్ట్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని వేలాది మంది తమ వాహనాల్లో ఆర్మేనియాకు బయలుదేరారు. దింతో రహదారులపై భారీగా రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో ఓ గ్యాస్ స్టేషన్ వద్ద ఇంధనం కోసం వాహనాలు క్యూ కట్టాయి. అదే సమయంలో అక్కడ భారీ పేలుడు సంభవించడంతో వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.