హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 మంది జూదరులు పట్టుబడ్డారు. పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అత్తాపూర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రూ. 7.5 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ప్లే కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మోచి కాలనీ కాలాపతేర్‌కు చెందిన ప్రధాన నిర్వాహకుడు మహ్మద్ ఖాదర్, అతని సహచరుడు మల్లేపల్లికి చెందిన దుర్గేష్ గ్యాంబ్లింగ్ నిర్వహించి అందులో పాల్గొన్న వారి నుంచి కమీషన్ వసూలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పాతబస్తీ, రాజేంద్రనగర్‌కు చెందిన చిరు వ్యాపారులు ఉన్నారు.
Gambling : రాజేంద్రనగర్‌లో పేకాట శిభిరాలపై దాడులు.. 20 మంది అరెస్ట్

Crime