Heart Attack : ఫ్లైట్‌లో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు..బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్టారా ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్న ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థకు గురైంది. ఊపిరాడక ఇబ్బంది పడింది

  • Written By:
  • Updated On - August 28, 2023 / 12:59 PM IST

గుండెపోటు (Heart Attack) ఒకప్పుడు 60 ఏళ్ల పైబడిన వారికీ ఎక్కువగా వచ్చేది..కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా వస్తుంది. పట్టుమని 20 ఏళ్లు లేని వారు సైతం గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా అందరితో సరదాగా ఉంటూ..సడెన్ గా గుండెపోటుకు గురై..హాస్పటల్ కు తీసుకెళ్లే లోపే మరణిస్తున్నారు. ఫిట్ గా ఉన్నవారు సైతం గుండెపోటుతో ప్రాణాలు విడవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తాజాగా రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడం ఇప్పుడు అందర్నీ కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ ఘటన బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్టారా ఫ్లైట్‌లో చోటుచేసుకుంది.

Read Also : ACP Ravinder : ఇలాంటి గొప్ప పోలీస్ చాల అరుదు..హ్యాట్సాఫ్‌ సార్

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్టారా ఫ్లైట్‌లో (Delhi Vistara flight ) ప్రయాణం చేస్తున్న ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థకు గురైంది. ఊపిరాడక ఇబ్బంది పడింది. అదే ఫ్లైట్‌లోనే ఢిల్లీ AIIMSకి చెందిన ఐదుగురు డాక్టర్లు ప్రయాణిస్తున్నారు. చిన్నారి పరిస్థితి చూసిన డాక్టర్స్ విమానం గాల్లో ఉండగానే వెంటనే CPR చేశారు. చిన్నారి పల్స్‌ పడిపోతుండడం… శరీరం పూర్తిగా చల్లబడిపోతుండడం..శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడం తో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి ఫ్లైట్‌ని నాగ్‌పూర్‌కి మళ్లించారు. అప్పటిలోగా చిన్నారికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రాథమిక చికిత్స అందిస్తూ వచ్చారు డాక్టర్స్. అందుబాటులో ఉన్న మెడికల్ డివైజ్‌లతోనే చిన్నారి ప్రాణం పోకుండా కాపాడారు. IV Canullaతో చికిత్స చేసి, మళ్లీ సాధారణ స్థితికి వచ్చి ఊపిరి తీసుకునేంత వరకూ చాలా సేపు శ్రమించారు. కాసేపటికి ఫ్లైట్‌ నాగ్‌పూర్‌కి చేరుకుంది. వెంటనే చిన్నారిని పీడియాట్రిషియన్‌కి అప్పగించారు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను Delhi AIIMS ట్విటర్‌లో షేర్ చేసింది. రెండేళ్ల చిన్నారి ప్రాణాలను CPRతో కాపాడాం అంటూ tiwtter పోస్ట్ చేసి..గుండెపోటు వచ్చినప్పుడు CPR చేయాలంటూ సూచించారు.

ఇటీవల గుండెపోటులు ఎక్కువ అవ్వడం తో తెలంగాణ సర్కార్ సైతం CPR చేయడం ఫై అవగాహనా పెంచుతుంది. ప్రతి ఒక్కరు CPR ఫై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.