Site icon HashtagU Telugu

Baramulla Encounter: జమ్మూలో తుపాకీ మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Baramulla Encounter

Baramulla Encounter

Baramulla Encounter: గత కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా తుపాకీ కాల్పుల మోత మోగింది.

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. బుధవారం ఉదయం బారాముల్లా జిల్లాలోని వాటర్‌గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు తెలిపారు.

బారాముల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇరువురి మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అదే సమయంలో భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

Also Read: Tulsi Parihar: మీ ఇంట్లో డబ్బు కొరత ఉండకూడదంటే.. తులసితో ఈ పరిహారాలు పాటించాల్సిందే?