Anantnag Encounter: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిందని పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని కోకెర్నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గాడోల్‌లో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఈరోజు ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లా అహ్లాన్ గాడోల్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. కోకెర్‌నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేస్తుండగా ఉగ్రవాదులు తమ పెట్రోలింగ్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
విదేశీయులుగా భావిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆర్మీ ప్రత్యేక బలగాలు ఆపరేషన్‌లో భాగంగా ఉన్నాయి.గత ఏడాది కాలంలో కోకెర్‌నాగ్‌లో జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదే. సెప్టెంబరు 2023లో కోకెర్‌నాగ్ అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మరణించిన సిబ్బందిలో కమాండింగ్ ఆఫీసర్, మేజర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నారు.
Also Read: Child Care : ఈ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో పిల్లలకు చర్మ సమస్యలు రావు..!