Site icon HashtagU Telugu

AP Road Accident: మారేడుమిల్లిలో రోడ్డు ప్ర‌మాదం…ఇద్ద‌రు మృతి

Road Accident Imresizer

Road Accident Imresizer

తూర్పుగోదావ‌రి జిల్లా మారేడుమిల్లి మండ‌లం దేవ‌ర‌ప‌ల్లి స‌మీపంలోని రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారుజామున వేగంగా వ‌స్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా…మ‌రో ఇద్ద‌రికి తీవ్రగాయాలైయ్యాయి. గాయాలుపాలైన వారిని రంప‌చోడ‌వ‌రం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు చింతూరు కు చెందిన అన్న‌ద‌మ్ములు గణేష్, సాయి లుగా పోలీసులు గుర్తించారు. గ‌ణేష్ రాజ‌మండ్రిలోని బొల్లినేని ఆసుప‌త్రిలో ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ వ‌ద్ద స‌హాయ‌కుడిగా ప‌ని చేస్తున్నాడు. క్షతగాత్రులు రాజమండ్రికి చెందిన కొనుతుల వెంకట గణేష్, ఐ.పోలవరంకు చెందిన ముర్రం సత్తిబాబుగా గుర్తించారు. రాజమహేంద్రవరం నుండి చింతూరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.