Site icon HashtagU Telugu

2 IAF fighter jets crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు

jets crash

Resizeimagesize (1280 X 720) 11zon

మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు (2 IAF fighter jets) కుప్పకూలాయి. గ్వాలియర్‌లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు.. మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిక్షణ సమయంలో విమానాలు కూలాయని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మోరీనా కలెక్టర్ తెలిపారు. SU-30 నుండి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రాజస్థాన్‌లో కుప్పకూలిన చాపర్

రాజస్థాన్‌లో చార్టర్డ్ చాపర్ ప్రమాదానికి గురైంది. భరత్‌పూర్‌ జిల్లా సమీపంలో చాపర్ కుప్పకూలింది. విషయం తెలుసుకున్న భరత్‌పూర్ కలెక్టర్ అలోక్ రంజన్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాగా.. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.