Site icon HashtagU Telugu

AP Tragedy: బీచ్‌లో పెను విషాదం.. ఇద్ద‌రు మృతి.. మ‌రో నలుగురు గల్లంతు..!

Drown

Drown

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని బాప‌ట్ల జిల్లాలోని సూర్య‌లంక బీచ్‌లో ఈ విషాదం నెల‌కొంది. పండుగ వేళ విహార‌యాత్ర‌కు వెళ్ల‌టంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే విహారయాత్ర‌కు 8 మంది యువ‌కులు సూర్య‌లంక బీచ్‌కు రాగా.. అందులో ఇద్ద‌రు యువ‌కులు నీటిలో మునిగి మృతి చెందార‌ని స్థానికులు పేర్కొన్నారు.

మ‌రో ఇద్ద‌రి యువ‌కుల‌ను స్థానికులు, జాల‌ర్లు కాపాడారు. మ‌రో నలుగురు యువ‌కులు కూడా గల్లంతైన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేప‌ట్టారు. అయితే ఈ 8 మంది యువ‌కులు విజ‌య‌వాడ నుంచి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. విహార‌యాత్ర‌కు అని సూర్య‌లంక బీచ్‌కు వ‌స్తే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.