Lucknow Building Collapse: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో(Lucknow)లో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా 20 మంది గాయపడినట్లు సమాచారం.భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం. భవనం బేస్‌మెంట్‌లో పనులు జరుగుతున్నప్పుడు కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి 13 మందిని బయటకు తీశారు. ప్రమాదం జరిగిన హర్మిలాప్ బిల్డింగ్ లో ఔషధ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.
So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X
— ANI (@ANI) September 7, 2024
ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం అధికారులకు సూచనలు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read: Aadhaar Card Applicants New Condition : ఆధార్ కార్డుకు అప్లై చేసేవారికి కొత్త కండీషన్ : అసోం సీఎం