Road Accident: బండ్లగూడలో కారు భీభత్సం.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం!

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళలపై‌కి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది.

Published By: HashtagU Telugu Desk
Kanpur

823573 Accident

గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళలపై‌కి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనురాధ, మమత అనే ఇద్దరు మహిళలు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోర్టు సన్‌సిటీ పరిధిలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాతంలో నిత్యం ఉదయం వేళల్లో వందల మంది వాకింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది.

కారు వేగానికి పుట్ పాత్ పై వాకింగ్ చేస్తున్న అనురాధ, మమతతో పాటు అనురాధ కూతురు కవిత కారుతో సహా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిపోయారు. అనురాధ, మమత అక్కడికక్కడే మరణించగా.. కవితకు తీవ్ర గాయాలయ్యాయి. కవితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కారులో ప్రమాదం సమయంలో ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. కారు ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, కారు డ్రైవ్ చేసే వ్యక్తి మద్యం సేవించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: TBJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి? ఈటల, బండికి కీలక పదువులు!

  Last Updated: 04 Jul 2023, 12:37 PM IST