Site icon HashtagU Telugu

Celebration-35000 Feets : 35000 ఫీట్ల ఎత్తులో 1983 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్

Celebration 35000 Feets

Celebration 35000 Feets

Celebration-35000 Feets : 1983 వరల్డ్ కప్‌ ను ఇండియాకు సాధించిపెట్టిన  క్రికెట్ హీరోలు 35,000 అడుగుల ఎత్తులో..  విమానంలో ప్రయాణిస్తూ గ్రాండ్ గా సెలెబ్రేషన్ చేసుకున్నారు.. క్రికెట్  ప్రపంచ కప్ ఛాంపియన్ గా ఇండియా అవతరించి 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా  ఈ వేడుక జరుపుకున్నారు. ఈవిషయాన్ని ట్విట్టర్ వేదికగా కీర్తి ఆజాద్ వెల్లడించారు. అదానీ గ్రూప్ గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్న ‘జీతేంగే హమ్’కార్యక్రమంలో పాల్గొనేందుకు తామంతా కలిసి విమానంలో బయలుదేరామని ఆయన తెలిపారు. 1983 వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు  గర్వంగా ఉందన్నారు.

Also read : World Cup Triumph: టీమిండియా తొలి విజయానికి 40 ఏళ్ళు.. 183 పరుగులు కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత్ బౌలర్లు..!

అదానీ ఏమన్నారంటే..

అహ్మదాబాద్‌లో జరిగిన జీతేంగే హమ్’కార్యక్రమం సందర్భంగా 1983 ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ తాను , టీమ్ సభ్యులు సంతకం చేసిన ప్రత్యేక బ్యాట్‌ను గౌతమ్ అదానీకి బహూకరించారు. గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘దేశంలో విస్తృతమైన భావోద్వేగాలను ప్రేరేపించే శక్తి క్రికెట్‌కు ఉంది. పుట్టుకతోనే ఎవరూ లెజెండ్‌లు కారు.. స్థిరత్వం, పట్టుదలతో కృషి చేసిన లెజెండ్‌లుగా ఎదుగుతారు. 1983లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టుకు ఉన్న ఈ రెండు లక్షణాలు వచ్చే వరల్డ్‌ కప్‌లో ఆడే జట్టుకూ ఉండాలి’ అన్నారు. చరిత్ర పునరావృతం కావాలని కాంక్షిస్తూ రాబోయే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

కపిల్ దేవ్ ఏమన్నారంటే.. 

‘2023 ODI ప్రపంచ కప్‌లో టీమిండియా విజయానికి మద్దతుగా అదానీ గ్రూప్‌తో ఏకం కావడం గౌరవంగా భావిస్తున్నాం’ అని కపిల్ దేవ్ అన్నారు. ఈ ప్రచారం త్వరలో డిజిటల్  విషెస్ వేదికను పరిచయం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాకు తమ శుభాకాంక్షలను, సందేశాలను దానిలో తెలియజేయవచ్చు.