Site icon HashtagU Telugu

LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 40 రూపాయలు తగ్గింపు..!

Free LPG Cylinder

Free LPG Cylinder

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) వినియోగదారులకు ఈ ఉదయం శుభవార్త అందింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరలను తగ్గించాయి. దీని తరువాత 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల వినియోగదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై దాదాపు 40 రూపాయల లాభం పొందబోతున్నారు. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంటే OMCలు 19 కిలోల LPG సిలిండర్ ధరను రూ. 39.50 తగ్గించాయి. వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు నేటి నుంచి అంటే డిసెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. అంటే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేటి నుంచి 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర తగ్గనుంది.

ధరలలో మార్పు తర్వాత ముంబైలో తక్కువ ధరకే LPG సిలిండర్ అందుబాటులో ఉంది. చెన్నై వినియోగదారులు అత్యధిక ధర చెల్లించవలసి ఉంటుంది. నాలుగు మెట్రోలలో ఎల్‌పిజి ధరలు ముంబైలో అత్యల్పంగా, చెన్నైలో అత్యధికంగా ఉన్నాయి. తగ్గింపు తర్వాత ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ ధర ఈరోజు నుండి రూ.1,710కి చేరింది. చెన్నైలో ప్రభావవంతమైన ధర రూ.1,929కి చేరుకుంది. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో రూ.1,757గా, కోల్‌కతాలో రూ.1,868.50కి చేరింది.

Also Read: YSRCP : విజయవాడ పశ్చిమ నుంచి మళ్లీ పోటీ చేస్తాన‌న్న వెల్లంప‌ల్లి.. తెర‌మీద‌కు మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీ పేరు

అంతకుముందు వాణిజ్య LPG సిలిండర్ల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉండేయి. గత 3 నెలల్లో వాటి ధరలు మూడుసార్లు పెరగగా, ఆ సమయంలో ధరలు రూ.320కి పైగా పెరిగాయి. గతసారి ఈ నెల ఒకటో తేదీన 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పిజి సిలిండర్‌ ధరను రూ.21 చొప్పున పెంచారు. అంతకు ముందు వాటి ధరలను నవంబర్‌లో రూ.101, అక్టోబర్‌లో రూ.209 పెంచారు.

We’re now on WhatsApp. Click to Join.